2019 బెస్ట్ రిపబ్లిక్ డే కొటేషన్స్:

  • Publish Date - January 25, 2019 / 12:07 PM IST

రిపబ్లిక్ డే విషెస్.. వాట్సాప్ స్టేటస్ సందేశాలు: జన్మదిన వేడుకల నుంచి ప్రతి వేడుక వరకు అందరూ విషెస్ చెప్పుకోవడం కామన్. వేడుక ఏదైనా సోషల్ మీడియా వేదికగా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలుపుతాం. అలాగే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన సమరయోధులను స్మరించుకునే పర్వదినాలైన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వేడుకుల సందర్భంగా కూడా వాట్సప్, ఫేస్ బుక్ ల్లో ఒకరినొకరు చక్కని కొటేషన్లు, ఫొటోలు, వీడియోలతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఏడాదిలో 70వ రిపబ్లిక్ డే  సందర్భంగా దేశ భక్తిని చాటేలా వాట్సప్ సందేశాలు వెల్లువెత్తున్నాయి. ప్రతి ఒక్కరి వాట్సప్ లో రిపబ్లిక్ డే వేడుకలపై బెస్ట్ కొటేషన్లు, ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. వాట్సప్ లో వైరల్ అవుతున్న రిపబ్లిక్ డే సందేశాల్లో కొన్ని బెస్ట్ కొటేషన్లు మీకోసం..        
1. జాతులు వేరైనా, భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే.. 
కులాలు వేరైనా, మతాలు వేరైనా… మనమంతా భారతీయులం.. 
2. ‘మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా 
భారతీయుల జెండా.. బుహు గొప్పదైన జెండా 
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా 
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా’
3. ‘నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను.. 
సదా నేను భారతమాతకు రుణపడి ఉంటాను.. 
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు..’ 
4. ‘దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే 
నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే 
ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. 
దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ.. 
వందేమాతరం.. అందాం మనమందరం..’ 
5. ‘సమరయోధుల పోరాట బలం… అమర వీరుల త్యాగఫలం.. 
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం.. 
6.సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని
భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన దినం’.. గణతంత్ర దినోత్సవం. 
అందరికి రిపబ్లిక్ డే కొటేషన్స్ శుభకాంక్షలు…