ముచ్చటగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు. కలిసి మెలిసి చక్కటి అనుబంధంతో ఉంటున్నారు. ఇది పెద్ద విషయం కాదు..విశేషం అంతకంటే కాదు. కానీ ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకేసారి గర్భవతులయ్యారు. అంతేకాదు ముగ్గురూ ఒకేసారి..ఒకేరోజు..ఒకే హాస్పిటల్‌లో ప్రసవించారు. సహజంగా అంటే నార్మల్ డెలివరీతో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఈ అరుదైన అద్భుతమైన ఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది.
దనీషా హయ్నెస్, ఎరియల్ విలియమ్స్, ఆస్లే హయ్నెస్ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు జులై 3న పురిటి నొప్పులతో ఒహియో మ్యాన్స్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో చేరారు. అలా ప్రసవం కోసం చేరిన ముగ్గురు అక్కచెల్లెళ్ల కేవలం నాలుగు గంటల తేడాతో ఒకరి తర్వాత ఒకరు బిడ్డలకు జన్మనిచ్చారు. ముగ్గురు తోబుట్టువులు ఇలా ఒకేసారి బిడ్డలకు జన్మనివ్వడమనేది 5 కోట్ల మందిలో ఒక కుటుంబంలోనే సాధ్యమవుతుందని మ్యాన్స్‌ఫీల్డ్ హాస్పిటల్‌లోని నిపుణులు తెలిపారు. ఇది చాలా అరుదైన ఘటన మా హాస్పిటల్ లో జరగటం చాలా సంతోషంగా ఉందని ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లూ..వారికి పుట్టిన బిడ్డలు చక్కటి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
కాగా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు ఒకే రోజు.. ఒకే హాస్పిటల్‌లో బిడ్డలకు జన్మనివ్వటమే కాదు మరోవిశేషం కూడా ఉంది. సిజిరియన్ ఆపరేషన్ ద్వారా కాకుండా ముగ్గురూ సహజ పద్ధతిలోనే సాధారణ ప్రసవంతోనే వారు బిడ్డలకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసిన మీడియా ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను ఇంటర్వ్యూ చేయటానికి ఆసక్తి చూపింది. కానీ ఈ మూడు ప్రసవాలను దగ్గరుండి పర్యవేక్షించిన డాక్టర్ ఎడ్రాయ్ మెక్‌మిలన్ అంగీకరించలేదు.
ఎరియల్ విలియమ్స్ కు పుట్టిన ఆడబిడ్డ 8 పౌండ్ల, 2 oun ల బరువుతోను..ఆస్లే హయ్నెస్ కు పుట్టిన బిడ్డ 6-పౌండ్ల 10-oun న్స్ బరువుతో పుట్టిన మగబిడ్డ..దనీషా హయ్నెస్ పుట్టిన ఆడ శిశువు కూడా చక్కటి ఆరోగ్యంతో పుట్టారని తెలిపారు.
కాగా..కొద్ది వారాల తేడాతోనే వీరు ముగ్గురు ప్రసవించాల్సి ఉండగా..ముగ్గురూ ఒకేసారి ప్రసవించాలని వారు అనుకున్నారని తెలుస్తోంది. దీంతో వారు ప్రసవాలనుకూడా వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలా వాయిదా వేసుకున్నా కూడా ముగ్గురు సాధారణంగా ప్రసవించటం మరో విశేషమని డాక్టర్లు చెబుతున్నారు.