ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు..ఏవయస్సులో ఎవరిపై ఎవరికి ప్రేమ పుడుతుందో తెలీదు. ప్రేమకు వయస్సుతోను..కులంతోను..ఆస్తిపాస్తులతోను..ప్రాంతాలతోను సంబంధం లేదు. ఆఖరికి జెండర్ తో కూడా సంబంధం లేదు. అనుకోకుండా పుట్టేదే ప్రేమ. అటువంటి ప్రేమ ఓ 70ఏళ్ల వృద్ధుడికి 55 ఏళ్ల మహిళపై ప్రేమ కలిగిలింది. ఆమెను వదిలి ఉండలేకపోయాడు.తన భార్యగా చేసుకోవాలని..ఆమెతో కలిసి బతకాలని ఆశపడ్డాడు. అదే విషయం ఆమెతో చెప్పాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించింది. అయ్యో…ఈ వయస్సులో ప్రేమేంటీ..అని వారు అనుకోకపోవటం ఓ విశేషమైతే..వారి పిల్లలు కూడా.. అనుకోకపోవటం మరో విశేషం. అంతేకాదు వారి పిల్లలు వారి ప్రేమను సంతోషంగా ఒప్పుకుని..వారే పెళ్లిపెద్దలుగా దగ్గరుండీ మరీ పెళ్లి చేశారు.
మధ్యప్రదేశ్‌లోని భూరఖెడీ గ్రామంలో ఒక విచిత్ర వివాహం జరిగింది. భురాఖేడి గ్రామానికి చెందిన ఉమ్రావ్ సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ఆరోగ్యం బాగాలేకి అశోక్‌నగర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అదే ఆస్పత్రిలో గుడీబాయి అనే 55 మహిళతో పరిచయం అయ్యింది. ప్రతీరోజు వారు మాట్లాడుకునేవారు. అలా ఇద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామా అని ఓ రోజున గుడీబాయిని ఉమ్మావ్ సింగ్ అడిగాడు. దానికి ఆమెకూడా సంతోషంగా ఒప్పుకుంది.
ఆ తరువాత గుడీబాయిని తీసుకుని ఉమ్మావ్ సింగ్ తన గ్రామం అయిన భురాఖేడీకి వెళ్లాడు. ఉమ్రావ్ సింగ్ తన నలుగురు కొడుకులను పిలిచి నేను ఈమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి వాళ్లు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఈ వయస్సులో మీకు ప్రేమేంటి?.పెళ్లేంటీ అని అనలేదు.సంతోషంగా ఒప్పుకున్నారు. పెళ్లి తామే దగ్గరుండి చేస్తామని చెప్పారు.
అన్నట్లుగానే ఏదో వృద్ధులే కదా తూతూ మంత్రంగా పెళ్లి చేసేస్తే అయిపోతుందని కదాని వాళ్లు అనుకోలేదు. చక్కగా హంగామాగా..డ్రమ్స్ ఏర్పాటు చేశారు..చిందులేశారు..ఊరందరినీ పెళ్లికి పిలిచారు. డ్యాన్సులేశారు. తండ్రి పెళ్లిలో నలుగురు కొడుకులతో పాటు మొత్తం 16మంది మనుమలు చిందులేస్తూ..పాటలు పాడుతూ మాంచి హంగామాగా పెళ్లి చేశారు. తమ సెల్ ఫోనుల్లో పెళ్లి వీడియోలు..ఫోటోలు తీస్తు నానా హంగామా చేశారు.
ఈ పెళ్లికి వచ్చిన అతిథులంతా కొత్త జంటకు చక్కటి గిఫ్టులు కూడా తెచ్చారు. మరోసారి ఓ ఇంటివాడివి అవుతున్నావో ఉమ్మావ్ శుభాకాంక్షలు అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.