సినిమా ఇండస్టీలో డ్రగ్స్ వాడకం గురించి లోక్‌సభలో ‘రేసుగుర్రం’ విలన్ సంచలన కామెంట్స్..
- sekhar
- Published On : September 14, 2020 / 06:27 PM IST
BJP MP Ravi Kishan Shocking Comments on Drug Addiction In Film Industry: డ్రగ్స్ కేసుతో బాలీవుడ్ ఇండస్ట్రీ రిలేషన్స్‌పై నటుడు, బీజేపీ ఎంపీ హరికిషన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ మేరకు లోక్‌సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనదేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.. డ్రగ్స్‌కు బానిసలుగా మారి యువత తమ జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.. ఈ డ్రగ్స్ మాఫియాలో మన పొరుగు దేశాల హస్తం ఉంది.. పాకిస్తాన్ నుంచి పంజాబ్, నేపాల్ మార్గాలద్వారా మనదేశంలోకి మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయి..
డ్రగ్స్ మా సినిమా పరిశ్రమను కూడా నాశనం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునేవారిని, సరఫరా చేసేవారిని చాలామందిని మా ప్రభుత్వం పట్టుకుంది. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చక్కగా పనిచేస్తుందని రవికిషన్ అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయట పడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి అతని మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తితో సహా మరికొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.. ఇప్పటికే హీరోయిన్స్ సంజన, రాగిణి ద్వివేదిలు అరెస్ట్ అయ్యారు.
