1974లో అమెరికాలోని కొలరాడో జైలు నుంచి పారిపోయిన ఓ ఖైదీ తిరిగి దాదాపు 50 ఏళ్ల తరువాత అరెస్టయ్యాడు. ఇదొక వింత అయితే..మరొక వింతేమిటంటే..50 ఏళ్ల కిందట ఏ పోలీసును కాల్చి పారిపోయాడో అదే పోలీసు ఆ ఖైదీని పట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే..లూయీ అర్చులెటా అనే 77 ఏళ్ల పెద్దాయన్ని బుధవారం (ఆగస్టు 5,2020) అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 1971లో డెన్వర్‌లో అతడు డేరిల్ సింకాంటా అనే పోలీసు అధికారితో లూయీ అర్చలెటా గొడపడ్డాడు. ఆయుధాల తనిఖీల విషయం ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో లూయీ అప్పటి పోలీసు అధికారి డేరిల్ సింకాంటాపై కాల్పులు జరిపి జైల్లోకొచ్చి పడ్డాడు. అతనికి న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అలా జైలుశిక్ష అనుభవిస్తున్న లూయీ 1974లో కొలరాడో జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎక్కడెక్కడో తిరిగి న్యూ మెక్సికో రాష్ట్రంలోని ఎస్పనోలాలో పేరు మార్చకుని జీవిస్తున్నాడు. రామోన్ మోంటోయా పేరుతో ఎస్పనోలాలో మకాం పెట్టేశాడు. కొంతకాలం రహస్యంగా తిరుగుతూ తన పనులు చేసుకునేవాడు. ఆ తరువాత ఇంకా తన కోసం పోలీసులు వెతుకుతారా? అనే నిర్లక్ష్యంతో బాహాటంగానే తిరిగేశాడు. 50 ఏళ్ల కిందట విషయం ఎవరికి గుర్తుంటుందిలే అనుకున్నాడు. ఓ పోలీసు అధికారిని కాల్చి జైలునుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నా తర్వాత పోలీసు అధికారులు పట్టించుకోలేదు. ఆ తరువాత 1971 లో డెన్వర్ పోలీసు అధికారి డారిల్ సిన్క్వాంటాను కాల్చి చంపినట్లు ఆర్చులేటాపై ఆరోపణలు వచ్చాయి. కానీ డేరిల్ లూయీ చనిపోయినట్లుగా నమ్మలేదు.
కాకపోతే..లూయీ చేతుల్లో గాయపడిన పోలీసు అధికారి డేరిల్ సింకాంటా మాత్రం ఊరుకోలేదు. తనమీద కాల్పులు జరిపి పరారైనవాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలని అతని కోసం గాలింపు మానలేదు. ఈ క్రమంలో డేరిల్ 1990లో రిటైరయ్యాడు. డ్యూటీలో ఉన్నంత కాలం అంటే 1990 వరకూ లూయీ కోసం వేటాడుతునూ ఉన్నాడు.
ఆ విషయాన్ని ‘చాలా పర్సనల్’గా తీసుకుని గాలింపు మానలేదు. లూయీ కోసం అతి బంధువుల్ని, స్నేహితుల్ని, తెలిసినవారిని ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరి వద్దా వివరాలు సేకరించాడు. వీరిలో చాలామంది డేరిల్ కు సహకరించలేదు. అయినా డేరిల్ నిరాశపడలేదు. లూయీ కోసం వెతకటం మానలేదు. అలా వెతగ్గా వెతగ్గా..2020 జూన్ 24న లూయీకి సంబంధించిన కీలక ఆధారం దొరికింది. దాంతో తీగలాగితే డొంక అంతా కదిలినట్లుగా పక్కా సమాచారంతో లూయీ దొరికింది. విషయం పోలీసులకు చెప్పాడు. అంతే.. పోలీసులు హుటాహుటిన న్యూమెక్సికో వెళ్లి లూయీని పట్టుకున్నారు.