చనిపోయింది అనుకున్న ఓ మహిళ శ్మశానవాటికలో బతికింది. ఆమె తిరిగి ఊపిరి తీసుకోవటంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. అంత్యక్రియల కోసం ఆమెను కుటుంబ సభ్యులు శ్మశానానికి తీసుకొచ్చి అక్కడ ఫార్మాలిటీస్ జరుగుతుండగా ఇంతో ఆమె ఊపిరి తీసుకోవటంతో ఆమె బంధువుల ఆనందపడిపోయారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఆమె చక్కగా కోలుకుంటోంది. ఈ ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లోని శివారు సౌత్‌ఫీల్డ్ లో చోటు చేసుకుంది.
గత ఆదివారం (ఆగస్టు 23,2020)ఉదయం 7.34 గంటలకు గుర్తు తెలియని ఓ మహిళ పారామెడిక్స్‌కు ఫోన్ చేసి..దయచేసి వెంటనే రండి ఒకామెకు ఆరోగ్యం బాగాలేదు..అసస్మారక స్థితిలో ఉంది అంటూ అడ్రస్ చెప్పి..దయచేసిన సహాయం చేయండి అంటూ కోరింది. దీంతో ఆమె చెప్పిన అడ్రస్ కు వెంటనే చేరుకున్న పారామెడిక్స్ సిబ్బంది 20 ఏళ్ల మహిళ అపస్మారకస్థితిలో పడి ఉండటంతో వెంటనే ఆమెకు పరీక్షలు చేశారు. అలా దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలతో ఆమె కోలుకోవటానికి యత్నించారు. కానీ కొంతసేపటికి ఆమె మృతిచెందినట్లు ధృవీకరించారు. శ్వాస ఆడకపోవడం, గత హెల్త్ రిపోర్ట్‌ల ఆధారంగా ఆమె మరణించిందని తేల్చారు.
ఆ వార్త విన్న ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ.. డెట్రాయిట్‌లోని జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదు..అక్కడ ఎంబాల్మింగ్ చేసే సమయంలో (అంటే మృతదేహాలను పదిలంగా భద్రపరిచే ప్రక్రియ. మృతదేహాలకు కొన్ని రసాయనాలు నింపుతారు)
సరిగ్గా ఆ అంబాల్మింగ్ ప్రక్రియ సమయంలో ఆమె శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమె బంధువులు ఆమెను మళ్లీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు పల్స్‌రేటు బాగుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పటంతో ఆమె కుటుంబ సభ్యుల సంతోషాన్ని అంతా ఇంతా కాదు.కానీ హాస్పిట్ వాళ్లు మాత్రం ఆమె పేరు చెప్పటానికి నిరాకరించారు.
కాగా..కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలో ఓ 12 ఏళ్ల బాలిక చచ్చి బతికి మళ్లీ చనిపోయింది. క్రోనిక్ డయాబెటీస్‌తో బాధపడుతూ కన్నుమూసిన సదరు బాలిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా కళ్లు తెరిచింది. వైద్యులు వచ్చి ఆమెకు చికిత్స అందించారు. కానీ, గంట తర్వాత మళ్లీ ఆ బాలిక చనిపోయింది. దీంతో ఆమెను ఖననం చేసిన విషయం తెలిసిందే.