ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది. ప్రభుత్వంపై నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రస్తారం చేసినా కేసులు పెట్టేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారం ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 2430 విడుదల చేసింది. గతంలో రద్దు చేసిన జీవోని రిఫరెన్స్ గా పేర్కొంటూ జీవో 2430 ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430పై విపక్షాల నుంచి తీవ్ర వ్యతికేత వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన ఫోర్త్ ఎస్టేట్‌ను ఏపీలోని జగన్ ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. తనకు నచ్చని మీడియాకు సంకెళ్లు వేస్తోందన్నారు. జీవో ద్వారా మీడియా గొంతునొక్కేందుకు వివిధ విభాగాల సెక్రటరీలకు అధికారాలను ధారాదత్తం చేయడం దారుణమని అన్నారు.
జీవో 2430ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. జీవోను ఉపసంహరించుకోలేదు. అయితే జీవో 2430 నిలుపుదల చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం(నవంబర్27, 2019) పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నిలుపుదలకు నిరాకరించింది.