ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఏపీ అగ్రస్థానం
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.
- veegam team
- Published On : December 19, 2019 / 01:31 PM IST
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గురువారం(డిసెంబర్ 19, 2019) ఢిల్లీలో ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
పథకం అమల్లో సమర్థ స్వపరిపాలన విభాగంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన జిల్లాల జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు అవార్డు లభించింది. ఏపీ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అవార్డులు అందుకున్నారు.
