వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి.వ్యామోహంలో పడినవారిని ఏ స్థాయిలో ఉన్నవారినైనా పాతాళానికితొక్కేస్తున్నాయి. అటువంటి వివాహేతర సంబంధం ఓ న్యాయమూర్తి ప్రాణాలు తీసిన ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో జరిగింది.
బేతుల్ నగర జడ్జి మహేంద్ర త్రిపాఠికి సంధ్యారాణి అనే 45 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. సామాజిక కార్యకర్త పనిచేసే ఆమెతో జరిగిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలంగా ఇద్దరూ ఆ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో గత నాలుగు నెలల నుంచి జడ్జి సంధ్యారాణిని దూరం పెట్టాడు. ఇది ఆమె సహించలేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. నన్ను పట్టించుకోవటం మానేశావు..ఇంకెవరన్నా దొరికారా? అంటూ వేధించటం మొదలు పెట్టింది. అయినా జడ్జి ఆమెను పట్టించుకోలేదు. తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న జడ్జిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. దాని కోసం ఏకంగా ఆ జడ్డి కుటుంబాన్ని అంతమొందించాలనుకుంది.
దీంట్లో భాగంగా జులై రెండో వారంలో జడ్జి మహేంద్రను కలిసి..అతనిపై ఉన్న కోపాన్ని అణచుకుని ప్రేమగా మాట్లడుతూ..నీకేమన్నా ఇబ్బందులుంటే నాతో చెప్పు అంటూ గోముగా అడిగింది.ఇంట్లో ఉన్న సమస్యలు పోవడానికి పూజలు చేయిస్తానని తెలిపింది. అది నమ్మాడు మహేంద్ర. గోధుమ పిండితో పూజలు చేయాలని చెప్పింది. మీరు ఆ పూజకు రానవసరం లేదు..పూజకు గోధుమ పిండి నేనే ఇస్తాను..పూజ చేసిన ఆ గోధుమ పిండితో చపాతీలు చేసుకుని ఇంట్లో వారంతా తింటే ఇంట్లో సమస్యలు అన్ని పోతాయని చెప్పింది. సంథ్యారాణి మాటలు జడ్జి మహేంద్ర నమ్మాడు.
అలా జులై 20న ఆమె మంత్రాలు వేయించానని చెప్పిన గోధుమ పిండిలో విషం కలిపి జడ్జికి ఇచ్చింది. అది పట్టుకెళ్లిన మహేంద్ర చపాతీలు చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి జడ్జి మహేంద్ర కుటుంబం ఆ గోధుమ పిండితో చపాతీలు చేసుకున్నారు. జడ్జితో పాటు ఇద్దరు కుమారుడు ఆ చపాతీలను తిన్నారు.
మహేంద్ర భార్య మాత్రం అన్నం తిన్నది. చపాతీలు తిన్న కాసేపటికే జడ్జి మహేంద్రకుతో పాటు ఆయన కొడుకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులయ్యాయి. దీంతో వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. జులై 25న పరిస్థితి విషమించడంతో జడ్జి ఆస్పత్రిలోనే చనిపోయాడు. ఆయన పెద్ద కొడుకు అభియాన్ రాజ్ ని మెరుగైన చికిత్స కోసం నాగపూర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతని పరిస్థితి విషమంగానే ఉంది. చిన్న కొడుకు పరిస్థితి మాత్రం కాస్త నిలకడగా ఉంది.
జడ్జి కుటుంబం మొత్తం ఇటువంటి పరిస్థితికి రావటంతో పోలీసులు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బైటపడింది. దీంతో సంధ్యారాణిని ఆమె డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తనను దూరం పెడుతున్నాడనే కోపంతో తానే గోధుమ పిండిలో విషం కలిపి ఇచ్చినట్లు ఆమె ఒప్పుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ శిమల ప్రసాద్ తెలిపారు. అనంతరం ఆమె ఇంటిలో పోలీసులు సోదాలు చేయగా పూజలు చేసినట్లుగా కొన్ని వస్తువులు కనిపించాయని తెలిపారు. ఈకేసు దర్యాప్తు కొనసాగుతోంది.