సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ : కీలకాంశాలపై చర్చ

ఏపీ సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

  • Publish Date - February 4, 2020 / 11:49 AM IST

ఏపీ సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

ఏపీ సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. రాజధాని తరలింపుపై సీఎం వద్ద రైతులు తమ సమస్యలు తెలపనున్నారు. రాజధాని ప్రాంతాలైనా తాడికొండ, మంగళగిరి నియోజవకర్గాలకు చెందిన రైతులంతా సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. సీఎంతో రైతులు సమావేశం అయ్యారు. దాదాపు 60 నుంచి 70 మంది రైతులు సీఎంను కలిశారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆర్కె, శ్రీదేవి రైతులను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. రైతులు, సీఎం జగన్ మధ్య కీలకమైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

మరోవైపు రైతులంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు సీఎం జగన్ ను కలవడం చర్చనీయాంశం అయింది. తమ సమస్యలు, రాజధాని ప్రాంతానికి సంబంధించి తమకున్న అనుమానాలు, అపోహలను పూర్తిస్థాయిలో సీఎంకు వివరిస్తున్నారు. ఇప్పటికే గత కేబినెట్ లో లీజును 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచారు. భూములు లేనటువంటి రైతులకు రూ.5 వేల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎంను కలిసిన తర్వాత రైతులు చెప్పినటువంటి సమస్యలపై సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారు? సానుకూలమైన ప్రకటన చేస్తారా, రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారనేది తెలియనుంది. 

అమరావతి రాజధాని విషయంలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది రాజధాని అమరావతిలోనే ఉండాలని, మరికొంత మంది రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లోని ఉండవల్లి, పెదపాక, బేతంపూడి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన రైతులు సీఎం జగన్ ను కలిశారు. తమ సమస్యలను సీఎంకు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగా ఇప్పటికే కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారంతా కూడా ఎలాంటి సమస్యలు సీఎంకు చెబుతారు? సీఎం రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారనేది తెలియనుంది. 

తొలిసారిగా మూడు రాజధానుల అంశంపై అధికారికంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాజధానుల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. గత జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం తెలిపింది.

రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఏపీ మూడు రాజధానులపై గల్లా జయదేవ్ సభలో అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. దీంతో ప్రభుత్వంలో జోష్ కనిపిస్తోంది.

విజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేగంగా వేస్తోంది. ఇప్పటికే అధికారులు అక్కడి భవనాల పరిశీలనలో నిమగ్నమై ఉన్నార. కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేస్తున్నారు. కొన్ని డిపార్ట్ మెంట్లను కర్నూలుకు తరలించేందుకు జీవోలు ఇవ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతులు సీఎం జగన్ ను కలవండం ఆసక్తిగా మారింది.