డిప్యూటేషన్ పై ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తమ రాష్ట్రానికి తెచ్చుకునే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. స్టీఫెన్ రవీంద్రను రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ గా నియమించాలనేది జగన్ ఉద్దేశ్యం.
జగన్ ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమించేందుకు ప్రయత్నాలు చెయ్యగా లేటెస్ట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. స్టీఫెన్ రవీంద్రను ఎపీకి పంపించాలని వైఎస్ జగన్ పోయిన ఏడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షాను స్వయంగా కోరారు. ఈ విషయంపై రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించలేదు, అలాగని ఆమోదించలేదు. పెండింగ్‌లో ఉంచింది.
ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గతంలో వైఎస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర… సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.