వారంతే : పవన్ తో పోటీ హ్యాపీ…
- veegam team
- Published On : January 7, 2019 / 05:08 AM IST
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల్లో పోటీ తనకు సంతోషమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల క్రమంలో రాజకీయాల్లో పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేస్తే తాను సంతోషిస్తానని వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు-పవన్ కలుస్తానంటే జగన్ కు ఎందుకంత బాధ అని ఇటీవలే సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయంపై జగన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విధంగా స్పందించారు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్ధతు ఇచ్చారనీ..ఇప్పుడు కూడా జనసేన, టీడీపీ ఒకటేనని..పైకి మాత్రం ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఏం జరిగినా..ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా తనకేమీ భయంకానీ..బాధ కానీ లేదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేస్తే ఇంకా సంతోషపడతానని జగన్ అన్నారు.
