నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా అని మండిపడ్డారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని.. అలాంటి

  • Publish Date - October 22, 2019 / 02:51 PM IST

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా అని మండిపడ్డారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని.. అలాంటి

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా అని మండిపడ్డారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని.. అలాంటి అమరావతిని చంపేశారని చంద్రబాబు వాపోయారు. ఐకానిక్ టవర్స్, గ్రీన్ ఫీల్డ్, డ్రీమ్ ప్రాజెక్టులను చంపేస్తారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. జగన్ సర్కార్ పై సీరియస్ అయ్యారు. బంగారు గుడ్డు పెట్టే బాతుగా అమరావతిని తయారు చేశామన్నారు.

ఏపీ పరిస్థితి చూస్తే బాధ కలుగుతుందని చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రస్తుతం కొన ఊపిరితో ఉందని వాపోయారు. నాకున్న విశ్వసనీయతను సింగపూర్ ప్రభుత్వం గుర్తించిందని, నాపై నమ్మకంతో ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో 11 శాతం గ్రోత్ రేట్ పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిందని చంద్రబాబు విమర్శించారు. తనకు డీజీపీ రూల్స్ నేర్పిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కాపాడే బాధ్యత టీడీపీపై ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత, విద్యుత్ కోతలు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు.. జే టాక్స్ పేరుతో వైసీపీ శ్రేణులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.