చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు..చెవులు కూడా వినిపించట్లేదు

  • Publish Date - December 13, 2019 / 06:23 AM IST

చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదనీ అందుకే మార్షల్స్ పై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి పైగా ఎదురు దాడికి దిగుతున్నారనీ..తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలోకి వస్తున్న సమయంలో మార్షల్స్ అడ్డుకునే విషయంపై అసెంబ్లీలో రగడ కొనసాగుతోంది.అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ..పురాణ కథలు చెప్పుకొచ్చారు. చంద్రబాబుని రాక్షసుడిగా అభివర్ణించారు. ఆయనా..టీడీపీ నేతలు మాట్లాడే అబద్దాలను లెక్కపెట్టుకుంటే సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులు కూడా సరిపోవని విమర్శించారు.  చంద్రబాబు నాయుడుకి ఉన్న రాజకీయ అనుభవం అంతా అబద్దాలు ఎలా చెప్పాలా? అనే విషయానికి పరిమితమైంది. మరోసారి ఆయన అధికారంలోకి రాకుండా ప్రజలు చూసుకుంటారని అన్నారు. 

చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇంత స్పష్టంగా వినిపిస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే వినిపించటంలేదనీ..బహుశా ఆయనకు వినికిడి సమస్యలు వచ్చి ఉంటాయి..కాబట్టి ఆయన్ని ఈఎన్టీ స్పెషలిస్టుకు చూపించాలని ఎద్దేవా చేశారు వైసీపీ నేత జక్కంపూడి నాని. 

చంద్రబాబుకు సిగ్గూ..సెరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గిల్లిన గిల్లుడికి  గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నడుము నొప్పులు కూడా వచ్చేశాయని ఎద్దేవా చేశారు. సభలో తనను ఎవరైనా ఏమైనా అంటే తేచి అరవండి అంటూ చంద్రబాబు బుచ్చయ్య చౌదరి నడుము పట్టుకుని గిల్లుతారట..అందుకే బుచ్చయ్యకు నడుము నొప్పులు వచ్చాయని ఎద్దేవా చేశారు.