అన్నీ సర్వేలు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయని, టీడీపీకి పట్టం కడుతూ స్పష్టమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని చంద్రబాబు అన్నారు.
అన్నీ సర్వేలు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయని, టీడీపీకి పట్టం కడుతూ స్పష్టమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. కేసిఆర్‌పైన జగన్ మీద నిప్పులు చెరిగారు. దేశమంతా మోడీకి ఎదురుగాలి వీస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రజా,బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో వైసీపీ బెంబేలెత్తుతుందని అన్నారు.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి
అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి పనులు చేయడానికైనా వైసీపీ వెనకాడదని , అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచాంచారు. టీడీపీపై కేసిఆర్ దాడి జగన్ కోసమేనని, ఇవాళ(9 ఏప్రిల్ 2019) రాష్టంలో ప్రచారం ఉదృతంగా చేయాలని అన్నారు. కడుపు నిండా విషం నింపుకున్న వ్యక్తి కేసిఆర్ అని, ప్రత్యేక హోదా గురించి కేసిఆర్ చెప్పే మాటలను నమ్మవద్దని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, కేసిఆర్, జగన్ నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు