ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు
ఏపీలో అర్థరాత్రి అధికారుల బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లా ఎస్పీ, తాడేపల్లి సీఐలపై వేటు వేశారు. దీనిపై మండిపడిన చంద్రబాబు.. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో ఎన్నికల అధికారి ద్వివేదీతో భేటీ అయ్యారు.
Read Also : చైతన్యం వచ్చింది : పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు
ప్రభుత్వం, పార్టీ తరపున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. మోడీ, జగన్ కనుసన్నల్లో ఈడీ పనిచేస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీ పరంగా లేఖ అందించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ.. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించటం ఏంటని నిలదీశారు. ఎన్నికల సంఘం తీరుపై అభ్యంతరాలతో వినతిపత్రం సమర్పించారు.
ఇక ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ బృందం వినతిపత్రం అందజేసింది. ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయని.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇంటిపై అర్థరాత్రి ఐటీ దాడులు జరిగిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
Read Also : మోడీని మాత్రమే చూపిస్తారా : దూరదర్శన్‌పై ఈసీ ఆగ్రహం