ఏపీలో ఈ ప్రాంతాల్లో ఉంటున్నారా? తస్మాత్ జాగ్రత్త

  • Publish Date - April 14, 2020 / 11:34 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కరాళ నత్యం చేస్తుంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఇప్పటికే 500కు దగ్గరలోకి రాగా.. పరిస్థితులు అప్పుడే అదుపులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నివసించేవారిని హెచ్చరిస్తూ.. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వెల్లడిస్తూ.. ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రాంతాల పేర్లను వివరిస్తూ పోస్ట్ చేసింది.

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్,  బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదైట్లు తెలిపిన ప్రభుత్వం ఈ ఏరియాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

వీటితో పాటు కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట,  చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని కోరింది ప్రభుత్వం. 
 

Also Read |  రేషన్ తీసుకున్న వారికి రూ. 1000 : ఎవరూ పస్తులు ఉండొద్దు – సీఎం జగన్