గోమూత్రంతో శానిటైజర్..రాసుకుంటే కరోనా రాదట

  • Publish Date - September 11, 2020 / 03:07 PM IST

గుజరాత్ కు చెందిన ఒక సహకార సంస్థ గోమూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జామ్ నగర్ లోని కామధేను దివ్య ఔషధ మహిళా మండలి సభ్యులు గో మూత్రంతో శానిటైజర్లను తయారుచేస్తున్నారు. ఈ శానిటైజర్లకు ‘గో సేఫ్’ శానిటైజర్ అని పేరు పెట్టారు.


ఓ పక్కన లాక్ డౌన్ మరోపక్క ఆర్థిక సమస్యలు. దీంతో జామ్ నగర్ లోని మహిళలు ఉపాధి వైపుగా అడుగులు వేస్తున్నారు. ఆవుపేడతో పలు రకాల వస్తువుల్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే కరోనా కాలంలో ‘గో సేఫ్ ’పేరుతో గోమూత్రంతో శానిటైజర్ తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా జామ్ నగర్ మహిళలు మాట్లాడుతూ..‘గో సేఫ్’ బ్రాండ్ శానిటైజర్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు ఎఫ్ డీసీఏ నుంచి లైసెన్స్ తీసుకుంటున్నామనీ..ఒక వారంలోగా దీనికి లైసెన్స్ వస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు.


ప్రస్తుతం ఈ గోసేఫ్ శానిటైజర్లను స్థానికంగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తమకు బ్రాండ్ వచ్చిన తరువాత శానిటైజర్లను మార్కెట్లో విడుదల చేస్తాం.’ అని కామధేను దివ్య ఔషధ మహిళా మండలి డైరెక్టర్ మనీషా షా తెలిపారు. గో సేఫ్ శానిటైజర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.