హుజూర్ నగర్ : 11 గంటలకు 31.34 శాతం పోలింగ్ నమోదు 

  • Publish Date - October 21, 2019 / 06:29 AM IST

ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ పోలింగ్ కొనసాగుతోంది. హుజూర్‌నగర్‌‌లో గెలుపును ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపు కోసం రెండు పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  ఓటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ పకడ్బంధీగా ఏర్పాట్లు చేసింది.

హుజూర్‌నగర్ బరిలో మొత్తం  28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా..మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు.. 1708 ఈవీఎంలను అధికారులు వినియోగిస్తున్నారు. 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించిన అధికారులు.. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.అలాగే 3,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి15 మంది పోలీసులు, ఉండగా వీరిలో 5 నుంచి 10 మంది సాయుధులు ఉన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని బాధ్యులుగా నియమించారు.

గరిడేపల్లి, నేరేడుచర్లలో 31,33 పోలీంగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా…పోలింగ్ కొనసాగుతోంది. మిగతా ప్రాంతాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.