25 కి.మీటర్లు మృతదేహాన్ని భుజాలపై మోసిన జవాన్లు : హ్యాట్సాఫ్ సైనికా..

  • Publish Date - September 2, 2020 / 12:57 PM IST

దేశాన్ని కాపాడటంలో తమ ప్రాణాల్ని సైతం పణ్ణంగా పెట్టే జవాన్లు..మానవత్వాన్ని చూపింటంలో కూడా మాకు మేమే సాటి అనిపిస్తున్నారు. దేశ ప్రజల ప్రాణాలను తమ భుజస్కంధాలపై మోసే మన జవాన్లు ఓ మృతదేహాన్ని కూడా మోసి మానవత్వానికి మారుపేరుగా నిలిచారు.



మరణించిన వ్యక్తి ఎవరో తెలియదు. అతనితో వారికి ఎటువంటి సంబంధాలూ లేవు… కనీసం ముఖ పరిచయం కూడా లేదు. కానీ అతని మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించటానికి..ఏకంగా 25 కిలోమీటర్ల దూరం 8 గంటల సుదీర్ఘం సమయం పాటు ఓ మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకుని భుజాన మోసుకుంటూ నడిచారు ఎనిమిది మంది జవాన్లు నడిచారు. ఉత్తరాఖండ్ పితోరాఘడ్ జిల్లాలోని సియునీ అనే మారుమూల గ్రామం నుంచి మున్సారీ అనే మరో పల్లె చేరేందుకు ఆ ఎనిమిది మంది జవాన్లు ఈ ‘సాహసం’ చేశారు.

సియునీ అనే చిన్న గ్రామంలో ఈ అపరిచిత వ్యక్తి మృత దేహాన్ని అతని బంధువులకు అప్పగించేందుకు జవాన్లు..రాళ్లు,రప్పల్లోను..కొండలు.. గుట్టలతో నిండిన అత్యంత కష్టతరమైన దుర్గమ మార్గం ద్వారా ఏకంగా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 30 ఏళ్ళ ఈ వ్యక్తి రాళ్లు కొడుతూ హఠాత్తుగా చనిపోయాడని తెలిసిన ఇండో-టిబెటన్ బోర్డర్ జవాన్లు ఇలా తమ మానవతను చాటుకున్నారు.