IPL 2020: టాస్ గెల్చి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ, స్పిన్నర్లే కీలకం.

  • Publish Date - September 19, 2020 / 07:21 PM IST

Chennai Super Kings v Mumbai Indians: చాలాకాలం తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. IPL 2020 ఫస్ట్ మ్యాచ్‌లో టాస్‌గెల్చి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో గత ఐపీల్ ఫైనల్‌లో ఓడిన ధోనీ ఈసారి ఫ్రెష్‌గా బరిలోకి దిగాడు.

ఐపీఎల్‌లో కాస్త లేటుగా పుంజుకొనే జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ మాత్రం ఈసారి ఆ చాన్స్ తీసుకోవడంలేదు. Abu Dhabi ముంబై ఇండియన్స కి హోం గ్రౌండ్ కిందేలెక్క. అదే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం, వికెట్ ను ఇంతవరకు చూడలేదు. సరాసరి వచ్చి ఆడుతోంది. అందుకే పిచ్ మీద ధోనికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చనన్నిది నిపుణుల మాట.



ధోనికి ఇలాంటివి కొత్తకాదు. వచ్చిరాగానే వ్యూహాలు పన్నడం అతని స్టైల్.

అబుదాబి పిచ్ మీద బంతేమీ విపరీతంగా స్పిన్ కాదు. కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140. ఒకవేళ 160 రన్స్ కనుక కొడితే ముంబై ఇండియన్స్ కున్న స్పిన్నర్లు చెన్నైని ఇబ్బంది పెట్టగలరు.



Krunal Pandya, Rahul Chahar, Jayant Yadav ,Anukul Roy ముంబై స్పిన్నర్లు. వీళ్లకు అనుభవం చాలా తక్కువ. ఈ నలుగురి కలసి తీసిన వికెట్లు 61 మాత్రమే. అదే రవేంద్ర జడేజా ఒక్కడే 108 వికెట్లు తీశాడు. ఈ లెక్కన ముంబైని ఓడించడానికి చెన్నైకి పెద్ద అవకాశమే ఉంది.