తప్పు జనసేనది కాదు.. వాళ్లకు ఓటు వేసిన వాళ్లది

  • Publish Date - March 14, 2020 / 07:55 AM IST

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి.. ఆ ధైర్యం మనకు ఉంది కాబట్టే మనం ఇంకా నిలబడి ఉన్నాం అని అన్నారు. నేను ముఖ్యమంత్రి అవ్వడానికో, సంపాదన కోసమో రాజకీయ పార్టీ పెట్టలేదు. పిరికితనంతో ఉన్న సమాజానికి ధైర్యం ఇవ్వడానికి రాజీకీయ పార్టీ పెట్టాను అని అన్నారు పవన్ కళ్యాణ్. 

ఏడేళ్లు ఉన్నాం… ఇంకో డెబ్బై ఏళ్లు ఉంటాం. నా తర్వాత కూడా భావజాలం ప్రజల్లోకి తీసుకుని వెళ్లే వాళ్లు వస్తారు అని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఓట్లు వేసే ప్రజల ఆలోచన తీరు కూడా మారాలని అన్నారు పవన్ కళ్యాణ్. గాంధీజీని పూజిస్తారు.. సుభాష్ చంద్రబోస్‌ని గౌరవిస్తారు.. అంబేడ్కర్‌ని గుండెల్లో పెట్టుకుంటారు.. కానీ ఓట్లు మాత్రం నేరస్థులకే వేస్తున్నారు.

వల్లభభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన వ్యక్తి అమిత్ షా వచ్చి నన్ను అడిగినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు.. తెలుగు ప్రయోజనాలు ముఖ్యం.. అని వారితో సత్సంబంధాలు పెట్టుకోలేదు. పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు పవన్ కళ్యాణ్. తిత్లీ తుఫాన్ వస్తే మనం వెళ్లి అక్కడ సాయం చేశాం… ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పక్క జిల్లాలో తిరుగుతూ కూడా అక్కడికి రాలేదు. అయినా కూడా వాళ్లకే ఓటేసిన వాళ్లది తప్పు కానీ జనసేనది కాదు అని అన్నారు పవన్ కళ్యాణ్.

See Also | ఏం జరుగుద్ది.. చచ్చిపోతాం.. ఒక్కడిగానే పార్టీ పెట్టా: పవన్ కళ్యాణ్