స్థానిక సమరానికి సిద్ధమైన జనసేన: జిల్లాల్లో కీలక నేతలు వీళ్లే!

  • Publish Date - March 9, 2020 / 10:07 AM IST

స్థానిక ఎన్నికల సమరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సిద్దం అవుతోంది.

ఇప్పటికే పొత్తులో భాగంగా మిత్రపక్షం బీజేపీతో సీట్ల సర్ధుబాటు గురించి చర్చలు జరిపిన జనసేన.. క్షేత్రస్థాయిలో కూడా ఏర్పాట్లను ముమ్మరం చేస్తుతంది. అందులో భాగంగానే జిల్లాలవారీగా సమన్వయకర్తలను నియమించింది జనసేన పార్టీ.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థలు ఎంపికతో పాటు నాయకులను సమన్వయం చేసేందుకు కొంతమందిని జిల్లాలవారీగా నియమించింది. నామినేషన్ దశ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేస్తారు.

ఏపీలో జిల్లాలవారీగా సమన్వయకర్తలు:
శ్రీకాకుళం : డాక్టర్ బి.రఘు
విజయనగరం : గడసాల అప్పారావు
విశాఖపట్నం : శ్రీ సుందరపు విజయ్ కుమార్
తూర్పుగోదావరి : బొమ్మదేవర శ్రీధర్ (బన్ను)
పశ్చిమ గోదావరి : ముత్తా శశిధర్ 
కృష్ణా : పోతిన మహేశ్ 
గుంటూరు : కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె.)
 ప్రకాశం : షేక్ రియాజ్ 
నెల్లూరు : సి.మనుక్రాంత్ రెడ్డి 
చిత్తూరు : బొలిశెట్టి సత్య 
కడప : డా.పి.హరిప్రసాద్ 
కర్నూలు : టి.సి.వరుణ్ 
అనంతపురం : చిలకం మధుసూదన్ రెడ్డి