జనసేన లాంగ్ మార్చ్: పాల్గొననున్న అచ్చెన్నా..అయ్యన్నా 

  • Publish Date - November 2, 2019 / 09:24 AM IST

ఏపీలో ఇసుక కొరతపై జనసేన చేపట్టి విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఉక్కునగరం విశాఖ వేదికగా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కారానికి జనసేనాని లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలని పవన్ పిలుపునిచ్చారు. పవన్ స్వయంగా విపక్ష నేతలకు ఫోన్ చేసారు. పవన్ పులుపు మేరకు టీడీపీ స్పందించింది. తన మద్దతును తెలియజేయటమే కాక..అచ్చెన్నాయుడు..అయ్యన్నపాత్రులు ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొననున్నారు. 

ఏపీలో ఇసుక కొరత పెద్ద సమస్యగా మారి..భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు దారి తీస్తోంది.  ఇది ఆందోళన కలిగించే సమస్యగా మారింది. రాజకీయ దుమారం రేగుతోంది. ఇసుక కొరతతో నిర్మాణాలు నిలిచిపోయి కార్మికుల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.

వీరి సమస్యలపై స్పందించిన  పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టారు. విపక్షాలు ఊహించని విధంగా స్పందించాయి. మద్దతునిస్తాయనుకున్న వామపక్షాలు పవన్ కు  హ్యాండిచ్చాయి. లాంగ్ మార్చ్ లో  పాల్గొనడం లేదంటూ సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. కానీ టీడీపీ మద్దతుని ప్రకటించింది. రాజకీయంలో శాశ్వత శతృవులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.