అనేక తర్జనభర్జనల అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 126 నియోజకవర్గాల అభ్యర్ధులను గురువారం రాత్రి ప్రకటించారు. మిషన్ 150+ లక్ష్యంగా చంద్రబాబు తన జాబితాను విడుదల చేయగా కృష్ణాజిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తిరువూరు, నూజివీడు, గన్నవరం, గుడివాడ, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట స్థానాలను అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో రెండు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. పామర్రు, పెడన నియోజకవర్గాల అభ్యర్ధులను టీడీపీ ప్రకటించలేదు.
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!
సామాజిక వర్గాల వారీగా చూస్తే..
బీసీలు -03
ఓసీలు- 08
ఎస్సీలు-02
మైనారిటీ -01
కృష్ణా జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు
తిరువూరు – కేఎస్ జవహర్
నూజివీడు – ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
గన్నవరం – వల్లభనేని వంశీమోహన్
గుడివాడ – దేవినేని అవినాష్
కైకలూరు – జయమంగళ వెంకటరమణ
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
అవనిగడ్డ – మండలి బుద్ధప్రసాద్
పెనమలూరు – బోడె ప్రసాద్
విజయవాడ వెస్ట్ – షబనా ముసరాత్ ఖాతూన్
విజయవాడ సెంట్రల్ – బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్
మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
నందిగామ – తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య)