71 రోజులు..121 మంది రుత్విక్కులు : దేశ భద్రత కోసం మహా యాగాలు

  • Publish Date - August 30, 2019 / 02:46 AM IST

దేశ భద్రత..సైన్య రక్షణ కోసం మహాయాగాలు నిర్వహించాలని శివకోటి శ్రీ మహాలక్ష్మీ శ్రీ పీఠం నిర్ణయం తీసుకుంది. ఈ పీఠం అనంతపురంలో ఉంది. దేశానికి ఉపద్రవాలు రాకుండా..ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..జపాలు..యాగాలు నిర్వహిస్తే బాగుంటుందని యోచించింది. ఈ మేరకు శ్రీ పీఠం వ్యవస్థాపకులు అప్పాస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు 71 రోజుల పాటు ప్రతినిత్యం 121 మంది రుత్విక్కులతో కోటి మహామృత్యుంజయ మంత్ర జపాన్ని అనంతపురంలోని శివకోటి దేవస్థానంలో నిర్వహిస్తామన్నారు. 

నవంబర్ 14వ తేదీన మహాలక్ష్మీ గణపతి యాగంతో 9 రోజుల మహాక్రతువులు ప్రారంభం కానున్నాయని, ఇవి నవంబర్ 22 వరకు సాగుతాయన్నారు. అతిరుద్రయాగం, సహా స్రచండీ, లక్ష మృత్యుంజయ యాగం, సర్వరక్షణ కోసం బగళాముఖి, శ్రీ ప్రత్యంగిర జపం, యాగాలు చేస్తామన్నారు. మృత్యుంజయ మంత్రాన్ని ప్రజలు కూడా జపించాలని, ఈ ఫలితాన్ని భరతమాత పాదాలకు ధారపోయాలని ప్రకటనలో పేర్కొన్నారు అప్పాస్వామి. జపం చేయాలని అనుకున్న వారు 98660 05751, 94408 34816, 94900 11044 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

ట్రెండింగ్ వార్తలు