యువతిని వేధిస్తున్నఆకతాయి: చెప్పులతో చితక్కొట్టిన మహిళలు

  • Publish Date - January 3, 2020 / 06:35 AM IST

అమ్మాయిలను వేధించటంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బీర్కూర్ లో ఓ యువతిని గత కొంతకాలంగా ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలతో..అసభ్య చేష్టలతో వేధింపులకు పాల్పడుతున్నారు. యువతి భయపడి మాట్లాడకపోవటంతో మరింతగా రెచ్చిపోయాడు.

ఇష్టానుసారంగా వేధింపులు కొనసాగించాడు. ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడేవాడు. నాకోసం టైమ్ స్పెండ్ చేయమని పార్కుకు వెళదాం..నాతో రా అని వేధించేవాడు. వేధింపులు ఎక్కువ్వటంతో భయపడిన బాధితురాలు తన మాస్టారుకు చెప్పింది. ఆయన యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

దీంతో వారు ప్లాన్ వేశారు. బుద్ది చెప్పాలనుకున్నారు. యువతితో ఆకతాయికి ఫోన్ చేయించారు. దీంతో  ఆ మాటలు నమ్మిన ఆకతాయి టిప్ టాప్ గా తయారై వచ్చాడు. దీంతో వాడిపై దాడిచేసేందుకు అందరూ సిద్దంగా ఉన్నారు. వచ్చినవాడిని వచ్చినట్లుగా చెప్పులతో మహిళలు చితక్కొట్టారు. నాకేం తెలీదు అన్నా వినిపించుకోలేదు. చెప్పులతో చితకబాదారు.