ఆంధ్ర తీరప్రాంతంలో కొత్త ఇంధనాన్ని పరిశోధకులు గుర్తించారు. బంగాళఖాతంలోని క్రిష్ణా గోదావరి (కే-జీ) బేసిన్ లోని సముద్ర లోపలి ఉపరితలానికి రెండు మీటర్ల లోపల మిథేన్ హైడ్రేట్స్ ఇంధనాన్ని గుర్తించినట్టు తెలిపారు.
ఆంధ్ర తీరప్రాంతంలో కొత్త ఇంధనాన్ని పరిశోధకులు గుర్తించారు. బంగాళఖాతంలోని క్రిష్ణా గోదావరి (కే-జీ) బేసిన్ లోని సముద్ర లోపలి ఉపరితలానికి రెండు మీటర్ల లోపల మిథేన్ హైడ్రేట్స్ ఇంధనాన్ని గుర్తించారు. గోవా నేషనల్ ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ ఒషినోగ్రఫీ, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్సిస్టూట్యూట్ ఇన్ హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త ఇంధనాన్ని గుర్తించింది. ఈ మేరకు జనరల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ జనరల్ నివేదక వెల్లడించింది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైనెన్స్ పరిశోధకులు ఈ నివేదికను ప్రచురించారు.
Also Read: సర్జికల్ స్ట్రయిక్స్ – 2.0 స్పెషల్ స్టోరీస్
భారత ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) లో మిథేన్ హైడ్రేట్ ఇంధన వనరులు ఉన్నట్టు గుర్తించడం ఇదే తొలిసారిగా నివేదిక తెలిపింది. మిథేన్ హైడ్రేట్ ఇంధనం.. తక్కువ ఉష్ణోగ్రత, హై ప్రెజర్ తో మిళితమై ఉంటుంది. నీటి ఘనీభవన స్థితిలో స్పటిక నిర్మాణంలో ఉండే భారీ స్థాయిలో మిథేన్ గ్యాస్ ఇంధనం దొరికినట్టు పరిశోధకులు నివేదించారు. నేచరుల్ గ్యాస్ లో ప్రధాన భాగమైన మిథేన్ పెద్ద మొత్తంలో లభించినట్టు తెలిపారు. శిలాజ ఇంధన రిజర్వాయర్ ను ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేదన్నారు. ఇందులో భారీ స్థాయిలో మిథేన్ ఇంధనం ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు.
Also Read: పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే
గత ఏడాది జనవరి-ఫిబ్రవరి సమయంలో సింధు సాధన రీసెర్చ్ నౌక కేజీ బేసిన్ లో విస్తృత పరిశోధనలు జరిపింది. ఈ పరిశోధనలో సముద్రం కింది ఉపరితల భాగంలో కొన్ని ప్రాంతాల శాంపిల్స్ తీసుకొని రీసెర్చర్లు పరీక్షించారు. మల్టీ బీమ్ ఎకో సౌండర్ సాయంతో కొన్ని ఫొటోలను తీసి విశ్లేషించారు. ఈ ప్రాంతాల్లో నాలుగు గ్యాస్ ప్లేర్ ను గుర్తించినట్టు నివేదిక తెలిపింది. హైడ్రోజన్ సల్ఫైడ్, మిథేన్ గ్యాస్ కు సంబంధించిన (మడ్డి) మలినాలను నీటి అంతర్భాగంలో గుర్తించినట్టు నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ పొరుగు ప్రాంతమైన మక్రాన్ తీరప్రాంతం సహా మెరైన్ లోని మిథేన్ స్రవించే ప్రాంతాలను గుర్తించారు.
Also Read:పాక్ వైఖరి మార్చుకోవాల్సిందే : రష్యా, చైనా
ఇందులో నీటి స్తంభం వంటి మిథేన్ నిక్షేపాలు కేజీ బేసిన్ లో ఉన్నట్టు రీసెర్చర్ల రిపోర్ట్ పేర్కొంది. భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్, ఆమ్లీకరణం, సముద్ర పర్యావరణ వ్యవస్థపై రీసెర్చ్ చేసేందుకు మిథేన్ ఎమిషన్ పాత్ర ఎంతో ఉపకరిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. భారత జలాల్లో మిథేన్ హైడ్రేట్ గ్యాస్ క్యుబిక్ మీటర్ల వరకు ట్రిలియన్ల కొద్ది ఇంధన నిక్షేపాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గ్యాస్ హైడ్రేట్ తో భవిష్యత్తులో భారత్ లో మంచి ఇంధన వనరుగా పనిచేస్తుందని మినస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంచనా వేస్తోంది.