రండి బాబూ రండి..మోడీ ఇడ్లీలు.. రూ.10లకు నాలుగు

  • Publish Date - September 1, 2020 / 02:25 PM IST

రండి బాబూ రండీ..ఇడ్లీలు..రుచి కరమైన ఇడ్లీలు..మోడీ ఇడ్లీలు..చాలా చవక..నాలుగు ఇడ్లీలు కేవలం రూ.10లే అంటూ..ఓ వ్యాపారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపేరుతో ఇడ్లీలు అమ్మేస్తున్నాడు. దీంతో జనం ఓరీ..నీ అసాథ్యం కూలా..ఏకంగా ప్రధాని పేరుతోనే ఇడ్లీలు..పోస్టర్లు వేసి అమ్మేస్తున్నావ్..అంటూ ఆసక్తి..ఆగి మరీ చూస్తున్నారు.



తమిళనాడులో ప్రధాని మోడీ పేరుతో ఈ వింత పోస్టర్లు వెలిశాయి. రూ. 10 నాలుగు ఇడ్లీలు ‘మోదీ ఇడ్లీస్’అంటూ సేలం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేశాడు మహేశ్ ఓ వ్యాపారి. ఆ ప్లెక్సీలపై ప్రధాని మోదీ ఫోటోతో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు మహేష్ ఫొటోలు కూడా ప్రింట్ చేయించాడు. దీంతో జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.
https://10tv.in/old-guards-have-sabotaged-rahul-gandhi-shiv-sena/
‘మోదీ ఇడ్లీస్’పేరుతో మహేష్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టి..ప్రస్తుతం సేలం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 22 చిన్నపాటి హోటళ్లలో వీటిని అందించనున్నారు. వీటికి వచ్చే ఆదరణ బట్టి మరిన్ని హోటళ్లలో ఈ ‘మోడీ ఇడ్లీస్’ను విస్తరిస్తామని మహేశ్ చెబుతున్నారు.



కాగా.. దేశవ్యాప్తంగా వీస్తున్న ప్రధాని మోదీ ప్రభంజనం తమిళనాడులోనూ విస్తరించాలన్నదే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడేలా ఈ వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టామని బీజేపీ నేతగా ఎదగాలనుకుంటున్న మహేశ్ అంటున్నారు.

ప్రతి రోజూ 40 వేల ఇడ్లీలను తయారు చేసి ప్రజలకు రుచికరమైన ఆహారం అందిస్తామని తెలిపారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో వచ్చే వారం హోటళ్లను ప్రారంభిస్తారు. ఈ వినూత్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంటోంది.



కాగా తమిళనాడులో గతంలోనే ఇది వరకే ‘అమ్మా క్యాంటీన్’ పేరుతో ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు తక్కువ ధరకే ఇడ్లీలను అందించి..పేరుకు పేరు..రాజకీయంగా మంచి పలుకుబడి పెంచుకోవటానికే చేయడానికేనని చెబుతున్నారు.