నా పేరు వాడితే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయండి : ఎంపీ విజయసాయిరెడ్డి 

  • Publish Date - December 26, 2019 / 08:00 AM IST

నా పేరుతో ఎవరైనా భూ దందాలు..అవినీతి పనులు చేసినట్లుగా మీ దృష్టికి వస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనీ..వారు ఎంతటివారైనా సరే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కమిషన్ కు సూచించారు. 
విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సీఎం జగన్ ప్రతిపాదించి నాటి నుంచి వైసీపీ నేతలు విశాఖలో భూ దందాలకు పాల్పడుతున్నారనీ..ఎకాల కొద్దీ భూములను కబ్జా చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ తనకు అటువంటి అవరసం గానీ ఆలోచన గానీ లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. కానీ తన పేరుతో ఎటువంటి అవినీతి పనులకు పాల్పడినా..వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టవద్దని కమిషనర్ కు సూచించారు. 

తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షంలో ఉన్న నేతలు ఎటువంటి భూ దందాలకు పాల్పడ్డారో తనకు తెలుసన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక..తాము అటువంటి పనులు చేయబోమనీ..అటువంటివి ఎవరైనా చేసినట్లగా తెలిస్తేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారంలో ఉండి అవినీతి పనులకు పాల్పడవద్దనీ ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి అందరికీ కోరారు.

తనకు విశాఖలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ తప్ప ఎటువంటి ఆస్తులు లేవనీ..తన పేరున గానీ..తన కుటుంసభ్యుల పేరుతో గానీ ఎటువంటి ఆస్తులు లేవనీ ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు.   

విశాఖకు సీఎం జగన్ : 24 కిలో మీటర్ల మానవ హారంతో వైసీపీ ఘన స్వాగతం  
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తరువాత మొట్టమొదటి సారి సీఎం జగన్ డిసెంబర్ 28న సీఎం విశాఖకు వస్తున్న సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ కు వినూత్నమైన భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా..విశాఖలో  24 కిలోమీటర్ల దూరం మానవహారంతో సీఎంకు స్వాగత పలికేందుకు విస్తృతమైన వినూత్నమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

విశాఖకు వస్తున్న జగన్ ను అడ్డుకోవటానికి కొంతమంది కుట్ర పన్నుతున్నారనీ వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రా వాసులతో పాటు గోదావరి జిల్లాల ప్రజలంతా సీఎం జగన్ కు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినందకు ప్రజలంతా పెద్ద ఎత్తున మానవ హారంగా నిలబడి సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపేందుకు తరలిరవాలని పిలుపునిచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి కైలాస్ గిరి సెంట్రల్ పార్క్ మీదుగా ఆర్కే బీచ్ వరకూ ప్రజలంతా మానవ హారంగా నిలబడి జగన్ కు స్వాగతం పలికి ధన్యవాదాలు తెలపాలని పిలుపునిచ్చారు.