పులివెందుల నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో దోచుకున్నారు

  • Publish Date - March 31, 2019 / 07:50 AM IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. పులివెందులలో భూములు కొనాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులు ఒప్పుకోరనీ, అడ్డుపడతారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వెళ్లి రాయలసీమ, పులివెందులలో వెళ్లి భూములు కొనగలరా? అని ప్రశ్నించారు. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను లాగేసుకున్నారని, ‘ఇలాగే జరుగుతూ పోతే రేపు మనం భూములు లేక బానిసలుగా ఉండాల్సి వస్తుంది. వాళ్లకు ఊడిగం చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ

అలాగే టీడీపీ రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను తిరగనివ్వడం లేదని, వైసీపీ కూడా అలాగే చేస్తుందంటూ విమర్శించారు. టీడీపీ, వైసీపీలు దోపిడీ చేసుకుని సొమ్మును పంచుకుంటున్నాయని,  దోపిడీ సొమ్ములో అచ్చెన్నాయుడు 60 శాతం, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు 40 శాతం పంచుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలని, శ్రీకాకుళం భాష, యాస, మాండలికంపై తనకు చాలా ప్రేమ ఉందని అన్నారు.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం