ఆధ్యాత్మిక వస్త్రధారణలో.. : తిరుపతిలో యోగభ్యాసం చేశా- పవన్ కళ్యాణ్

  • Publish Date - December 4, 2019 / 06:35 AM IST

రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వరుడి సేవలో పాల్గొని. మొక్కులు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్‌తో పాటూ నాదెండ్ల మనోహర్.. ఇతర పార్టీ నేతలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు జనసేనాని.

మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో యోగభ్యాసం నేర్చుకున్నట్లు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ధర్మో రక్షిత రక్షిత: అనే నియమం ఏడుకొండల స్వామి నుంచే నేర్చుకున్నానని, దానిని త్రికరణశుద్ధిగా పాటిస్తున్నానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్.

చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టూర్ సాగుతోంది. ఈ పర్యటనలో నియోజకవర్గాల వారీగా సమీక్షలతో పాటూ పార్టీ బలోపేతంపై స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. అలాగే రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.