‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం..పల్లకీలు మోద్దాం..
‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం..పల్లకీలు మోద్దాం.. అంటే మీరు చెయ్యండి ఆ పని.. కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు..మీ తరం ఏమిచ్చింది ? ఏమి అభివృద్ధి చేశారు ?..మర్యాద ఇచ్చాను..పెళ్లికి రావడం నా సంస్కారం..అంతవరకు ఉంచుకోండి..అంటూ తోట త్రిమూర్తులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘాటుగా హెచ్చరించారు. తోట త్రిమూర్తులు, మెట్ల సత్యనారాయణలు చేసిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్
ఏప్రిల్ 08వ తేదీ సోమవారం అమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోట త్రిమూర్తులు, మెట్ల సత్యానారాయణలు చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇష్టానికి మాట్లాడితే ఊరుకోమని..టీడీపీతో లాలూచీ పడుతానంటే మీ ఇష్టమన్నారు. వారు మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ బానిసచెర నుండి విముక్తి కల్పించాలని తాను వచ్చానని, వారి మోచేతి నీళ్లు తాగాలంటే..తాగాలని తోట త్రిమూర్తులకు సూచించారు.
ప్రజారాజ్యాన్ని సొంత పార్టీ నేతలే చంపేశారన్నారు. పులివెందులలో దళితులను అణిచివేస్తున్నారని, సామాజిక న్యాయం కోసం అందరూ మాట్లాడుతారు కానీ ఎవరూ పాటించరని..జనసేన ఒక్కటే సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడమంటే జగన్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. తనకు కుల పిచ్చి లేదు.. కులాలను కలుపుతూ అభివృద్ధి సాధించాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ వెల్లడించారు.
Read Also : బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి : పసుపు కుంకుమ చెక్కులు డిపాజిట్ చేశారు