ఇకపై ఇసుక డోర్ డెలివరీ : సీఎం జగన్

  • Publish Date - December 30, 2019 / 08:51 AM IST

ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక డోర్ డెలివరీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. జనవరి 7న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీలు ఉంటాయని..జనవరి 20లోపు అన్ని జిల్లాల్లోను ఇటువంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 
 
పాలు, పేపర్, డోర్ డెలివరీ ఉంటాయి. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే కూరగాయలు..ఫుడ్ ఐటెమ్స్ డోర్ డెలివరీలు చేస్తున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీలో కొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇప్పుడు ఇసుకను కూడా డోర్ డెలీవరీలు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే జనవరి 7 నుంచి  ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.