రాష్ట్రానికి రెండవ రాజధాని ప్రసక్తే లేదు.. సీఎం క్లారిటీ

  • Publish Date - August 21, 2020 / 11:32 AM IST

తమిళనాడుకు రెండవ రాజధాని అంశం గత కొన్ని రోజులుగా రాష్టరంలో సంచలనం సృష్టిస్తోంది. డిమాండ్ పెరుగుతోంది. ఏకంగా మంత్రులే దీనికి పట్టుబడుతూన్నారు. చెన్నై తర్వాత మధురైని కూడా రాజధాని చేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. దీనిపై సీఎం పళనిస్వామి స్పందిస్తూ.. రెండవ రాజధాని ప్రసక్తే లేని స్పష్టంచేశారు.



తమ ప్రభుత్వం వద్ద రెండో రాజధాని ప్రతిపాధన ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండవ రాజధాని అంశంపై మాట్లడే మంత్రులు అది వారి వ్యక్తిగత అభిప్రాయమని తెలిపార ..ఇటువంటి ప్రకటనలు చేస్తున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రెండవ రాజధాని అంటూ అనవసరంగా వివాదం చేయవద్దని సూచించారు. ఇది ఇంతటితో ఆపేయాలని హితవు పలికారు.

కాగా..మథురైను రెండో రాజధానిగా ప్రకటిస్తే ఆర్థికంగా, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని కొంత మంది మంత్రులు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసే చర్యలను తమిళనాడు మంత్రులు ప్రస్తావిస్తూ తమిళనాడుకు కూడా రెండవ రాజధాని అవసరం ఉందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.



అంతేకాదు మధురైని రెండవ రాజధానిగా చేయాలంటూ హైకమాండ్ ను కోరూతూ..రెవెన్యూ మంత్రి ఆర్ బీ ఉదయ్ కుమార్ ఓ తీర్మానాన్ని తయారు చేసి..దాన్ని ఆమోదించారు. దీనికి మంత్రి సెల్లూరు రాజకు మద్దతు తెలిపారు. పలువురు మంత్రులు కూడా ఈ తీర్మానానికి ఆమోదం పలికిన క్రమంలో సీఎం పళనిస్వామి తమిళనాడుకు మధురైని రెండవ రాజధాని చేస్తుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టటానికి సీఎం పళనిస్వామి స్పందిస్తూ రెండవ రాజధాని ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. మరి సీఎం ప్రకటన తరువాత మంత్రులు మిన్నకుంటారో ..లేదా ఈ డిమాండ్ పై అధిష్టానంపై ఒత్తిడి తెస్తారో వేచి చూడాలి.