కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. అది నేటి కరోనా కాలంలో తప్పనిసరి రూల్. ఆ రూల్ ని అతిక్రమిస్తే కొన్ని రాష్ట్రాలు నగదు జరిమానా..లేదా జైలు అంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ..మాస్క్ లు పెట్టుకోకుండా బైటకొస్తే..జరిమాలు కాదు..ఓ విచిత్రమైన శిక్షలు వేస్తున్నారు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ట్రాఫిక్ పోలీసులు.
దీంతో తప్పదురా బాబూ ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్న ప్రజలు మాస్క్ పెట్టుకోకుండా బయటికి రావడం మానేశారు. ఇల్లు కదిలితే చాలా ఎక్కడ పోలీసులు కనిపిస్తారో..రోడ్డు పై రెండు గంటలు కూర్చోబెడితే పరువు పోతుందని కంపల్సరిగా మాస్క్ లు పెట్టుకుంటున్నారు.ఇంకోసారి మాస్క్ పెట్టుకోకుండా బయటికి రాముసార్..అని చెబుతున్నారు.
సిలిగురిలో కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని 9 మున్సిపల్ వార్డులు, డార్జిలింగ్, జల్ పాయ్ గురి జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారు.
Read here>>ప్రపంచ జనాభా దినోత్సవం 2020: మన దేశ జనాభా 307 కోట్లు ఉండేది!