రాష్ట్రాన్ని గందరగోళంలో పడేసిన సీఎం జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు

  • Publish Date - December 25, 2019 / 06:29 AM IST

రాష్ట్రానికి మూడు రాజధానలు అని ప్రకటించి రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన సీఎం జగన్ కు ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు అని టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదు..సీఎం జగన్ కు అండ్ గ్యాంగ్ మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్మస్ సందర్బంగా ఆ భగవంతుడ్ని కోరుకోండి అంటూ ఎద్దేవా చేశారు.  

కాగా అసెంబ్లీ  వేదికగా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటన చేసిన రోజు నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రాజధాని కోసం భూములిచ్చిన తమను నడి రోడ్డుపై నిలబెట్టి..మా పిల్లల భవిష్యత్తును అంధకారం చేసిన సీఎం జగన్ మాత్రం తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా క్రిస్మస్ పండుగను చేసుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈరోజుకు ఎనిమిది రోజుల నుంచి రోడ్లపైనే కూర్చుని మూడు రాజధానుల విషయంపై సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.