భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కు సంబంధించిన వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కు సంబంధించిన వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ కు ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. చైనా నుంచి ఇండియాకు వచ్చిన వారిలో తెలుగు వారు కూడా ఉండటంతో ఏపీ ప్రభుత్వం ముందస్తుగా కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లోనూ కలకలం
కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇటీవల చైనా నుంచి 32 మంది హైదరాబాద్ వచ్చారు. వారిని గుర్తించిన కేంద్రం.. వారందరికి నోటీసులు పంపింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని నోటీసుల్లో తెలిపింది. పుణె నుంచి శుక్రవారం(జనవరి 31,2020) సాయంత్రానికి కరోనా వైరస్ టెస్ట్ కిట్స్ గాంధీ ఆసుపత్రికి చేరుకోకున్నాయి.
వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఐసోలేటేడ్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
భారత్ లో రెండో కరోనా కేసు
భారత్ లో రెండో కరోనా కేసు నమోదు అయింది. కేరళలో మరో వ్యక్తి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. భారత్ లో నమోదైన రెండు కేసులు కేరళలోనే గుర్తించడంతో భయం నెలకొంది.
చైనా నుంచి స్వదేశానికి 323 మంది భారతీయులు
చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు. వారిని మానెసర్ క్యాంపుకు తరలిస్తున్నారు. తొలి విడతలో 324 మందిని తీసుకొచ్చిన అధికారులు…మానెసర్ క్యాంపుకు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.