అనంతపురం జిల్లా తాడిపత్రిపై గద్దలు వాలాయని ప్రజలు ఆ గద్దల బారిన పడకుండా..కాపు కాసేందుకు నేను ఉన్నాననీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రిపై ఇప్పటి వరకూ ఈగ కూడా వాలకుండా కాపు కాసాననీ..కానీ ఇప్పుడు గద్దలు వాలాయి..అయినా తాడిపత్రిలో ప్రజలకు అండగా ఉంటాననీ..ప్రజలు గద్దల బారిన పడకుండా కాపు కాస్తానని అన్నారు.
ప్రజల్ని పీక్కుతినాలని తాడిపత్రిపై వాలిన గద్దలు మా గోర్లు కూడా పీకలేవని..మా ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసని తనదైన శైలిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో పోలీసులపై ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తామనీ ధీమా వ్యక్తం చేసిన ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తమపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు కూడా జైలుకెళ్తారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రావొద్దని పోలీసులు గట్టిగా మొక్కుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.
పోలీసుల యాక్షన్‌కు మా రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని జేసీఅన్నారు. కేసులు పెట్టి లోపలేయడం తప్ప… పోలీసులు ఏం చేయలేరని..తాడిపత్రిలో ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా కొద్దిరోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటానంటూ జెసీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.