వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే భోదన

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు.

  • Publish Date - November 14, 2019 / 07:57 AM IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు. ఒంగోలులో నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ చదవకపోతే ప్రపంచంతో పోటీ పడలేమని అన్నారు. ప్రపంచంతో పోటీ పడలేక కూలీలుగా, డ్రైవర్లుగా మిగిలిపోయి.. నైపుణ్యం లేదని పిల్లలుగా ఉంటారని తెలిపారు.

మూడేళ్లలో 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 15 వేల స్కూళ్లను తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం రూ.3 వేల 500 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. ప్రతి స్కూల్ కూడా ఎలా మారిందో చూపిస్తామని చెప్పారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొస్తామమని చెప్పారు. ఇంజనీరింగ్, డిగ్రీ చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందన్నారు. హాస్టలో ఉండే విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. జనవరి 9వ తేదీ అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని కూడా తీసుకువస్తామన్నారు. 

ట్రెండింగ్ వార్తలు