పురుగుల మందు డబ్బాలతో రైతులు : తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కలకలం

ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చారు. ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు

  • Publish Date - December 2, 2019 / 09:08 AM IST

ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చారు. ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు

ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చారు. ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తమకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని తుమ్మపల్లి రైతులు ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది తీరుతో విసిగిపోయామన్నారు. ఇవాళ అటో ఇటో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. వెంటనే తమకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చనిపోతామని హెచ్చరించారు.

రైతుల తీరుతో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో రావడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.