కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్ బేబీలట..గైడెడ్ క్షిపణుల టెక్నాలజీ..భారతదేశానికి కొత్తేం కాదనీ..విష్ణుమూర్తి సుదర్శన చక్రం శతృసంహారం చేసిన తిరిగి విష్ణుమూర్తి చేతికి వచ్చింనీ..దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి గైడెబ్ క్షిపణుల మేకింగ్ కొత్తేం కాదని ఓ యూనివర్శిటీ వీసీ వ్యాఖ్యానించారు.
జలంధర్ : కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్ బేబీలట..గైడెడ్ క్షిపణుల టెక్నాలజీ..భారతదేశానికి కొత్తేం కాదనీ..విష్ణుమూర్తి సుదర్శన చక్రం శతృసంహారం చేసిన తిరిగి విష్ణుమూర్తి చేతికి వచ్చింనీ..దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి గైడెబ్ క్షిపణుల మేకింగ్ కొత్తేం కాదని ఓ యూనివర్శిటీ వీసీ వ్యాఖ్యానించారు. జనవరి 3న ఆంధ్రా యూనివర్శిటీ జరుగున్న భారత సైన్స్ కాంగ్రెస్‌లో వైస్ ఛాన్సలర్ జి.నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. వేలాది ఏళ్ల క్రితం నుంచే గైడెడ్ క్షిపణులకు సంబంధించిన టెక్నాలజీ భారత్‌కు బాగా తెలుసనీ అన్నారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు శత్రుసంహారం కోసం సుదర్శనచక్రాన్ని వదిలే వారని..శతృసంహారం అయిపోయిన తరువాత ఆ చక్రం కాస్తా వెనుదిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చేసేదనీ దీన్ని బట్టి చూస్తే గైడెడ్ క్షిపణి పరిజ్ఞానం భారత దేశానికి ఏ మాత్రం కొత్తకాదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ వీసీగారి పురాణం అప్పుడే పూర్తి కాలేదు..కౌరవుల తల్లి గాంధారి మాత పుట్టిన కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్ బేబీలేనని ఆయన వ్యాఖ్యానించారు. గాంధారీ మాతకు అబార్షన్ అయిన తరువాత ఆ 101 అండాలను (100మంది కౌరవులతో పాటు ఒక సోదికి కూడా వుంది) 101 కుండల్లో ఉంచి ఫలదీకరించిన మీదటే కౌరవుల జననం జరిగిందని దీన్ని ఎవరు కాదంటారు అని వీసీ జి.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.