చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు.

  • Publish Date - December 26, 2019 / 09:51 AM IST

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు.

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుడు అంతటి శంకరయ్య గౌడ్‌ ఉదయం కల్లుగీయడానికి వెళ్లాడు. మోకు జారి చెట్టుపైనే కన్నుమూశాడు. 

అతని మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కల్లుగీతే తమ కుటుంబపోషనని, ప్రభుత్వం వారిని అదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. శంకరయ్య గౌడ్ మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.