వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
విజయమ్మ : –
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని విజయమ్మ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. మార్చి 30వ తేదీ శనివారం ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తారు. మార్చి 31న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. వైఎస్ విజయమ్మ మొత్తంగా 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
షర్మిల : –
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మార్చి 29వ తేదీ శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మంగళగిరి నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 10 జిల్లాలో ఆమె ప్రచారం చేయనున్నారు. మార్చి 29వ తేదీ శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం చేస్తారు.
Read Also : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్
మార్చి 31వ తేదీ శనివారం గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. మార్చి 31 ఆదివారం గుంటూరు జిల్లాలోని తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోనూ ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొత్తంగా షర్మిల 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
Read Also : లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!