నరసరావుపేట : వైసీపీ-టీడీసీ అభ్యర్థులపై పరస్పర దాడులు
- veegam team
- Published On : April 11, 2019 / 07:32 AM IST
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. నరసరావుపేటలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాయపడ్డారు. ఎమ్మెల్యే చేతికి గాయమైంది. ఎమ్మెల్యే కారుని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. లాఠీలకు పని చెప్పటంతో కార్యకర్తలు బూత్ నుంచి వెళ్లిపోయారు.
ఇదే నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపైనా దాడి జరిగింది. ఉప్పలపాడు గ్రామంలో పోలింగ్ సరళి చూసేందుకు వెళ్లిన అరవిందబాబుని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది. ఈ గొడవలో అరవిందబాబుకి గాయాలయ్యాయి. ఆయన కారు ధ్వంసమైంది. మరో ఇద్దరు గాయపడ్డారు.
