అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం. ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలే. ఆనందంతో వెలిగిపోయే ముఖాలే దర్శనమిస్తున్నాయి. ఈ సంతోషాల శుభాకాంక్షల మధ్యా ఓ వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియో ఫ్రెండ్షిప్ డే స్ఫూర్తిని చాటుతోందంటూ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దీన్ని షేర్ చేస్తూ స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక గొడుగులో ఆరుగురు చిన్నారులు పుస్తకాలు, పలకలు పట్టుకుని స్కూలుకు వెళ్లుతున్నారు. లేదా స్కూల్ నుంచి వస్తున్నారో గానీ..ఈ వీడియో చూసినవారంతా తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. వర్షం పడినప్పుడు స్కూల్ కు వెళ్లిన గుర్తుల్ని నెమరువేసుకున్నారు. ఒకరు లేక ఇద్దరు పట్టే గొడుగులో వర్షం పడుతున్న వేళ అంతమంది పిల్లలు వెళ్లడం వాళ్ల మధ్య అందమైన చెలిమికి నిదర్శనం అంటూ నెటిజన్లు ఈ వీడియోకి నీరాజనాలు పట్టారు.
Friends be like…
Happy #FriendshipDay2020 everyone !! ? pic.twitter.com/KcbNgB4zCW
— Priyanka Shukla (@PriyankaJShukla) August 2, 2020