మైదుకూరులో వింత : ఈ ఆవుకి ఆ దుకాణంతో అనుబంధం ఏంటీ

  • Publish Date - October 30, 2019 / 05:59 AM IST

ఓ ఆవు ప్రతీ రోజు బట్టల దుకాణానికి వస్తోంది. ఒక్క రోజు కూడా ఆరు నెలలుగా ఇదే తంతు. తరిమినా వెళ్లదు. షాపు తెరిచిన వెంటనే.. ఎక్కడ ఉన్నాటైంకి వచ్చేస్తోంది. తీరిగ్గా షాపులో తిట్టవేస్తోంది. వెళ్లగొట్టాలని ప్రయత్నించినా కదలదు. హాయిగా పరుపుపై, ఫ్యాన్ కింద సేద తీరుతుంది. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత ఆ ఆవు వెళ్లిపోతుంది. కడప జిల్లా మైదుకూరులోని ఓ బట్టల షాపులో జరుగుతున్న ఈ వింత – విశేషాలు తెలుసుకుందాం..

మైదుకూరులో ఓబయ్య అనే వ్యాపారికి బట్టల షాపు  ఉంది. సాయి రామ్ క్లాత్ షోరూమ్. నిత్యం కష్టమర్లతో ఎంతో రష్ గా ఉంటుంది. కష్టమర్ల వచ్చినా రాకున్నా.. ఆరు నెలలుగా ఓ ఆవును ప్రతీ రోజూ వస్తుంది. కొత్తలో షాపులోకి వస్తున్న ఆవుని సిబ్బంది అడ్డుకున్నారు. అది ఆగకుండా.. నెట్టుకుని చక్కగా ఫ్యాన్ కింద తిష్ట వేసింది. దాన్ని కొట్టి బైటకు తోలేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. కదలకుండా అలాగే పడుకుంటోంది.

షాపు యజమాని ఓబయ్య కూడా ఆవుని కొట్టి బైటకు తోలేందుకు యత్నించాడు. దెబ్బలు తింది కానీ కదల్లేదు. వ్యాపారం దెబ్బతింటుందేమోనని భయపడ్డాడు. అయితే రోజూ షాపులోకి వస్తున్న ఆవుని చూసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపించటం మొదలుపెట్టారు. క్రమంగా ఆవు వల్ల వ్యాపారం పెరిగింది. అప్పటి నుంచి యజమాని ఓబయ్య కూడా ఆవుకు ప్రత్యేకంగా చూసుకోవటం మొదలుపెట్టాడు. పరుపుపై సేదతీరే ఆవుకి పూజలు చేస్తూ..ఆహారం అందిస్తున్నారు. ఆ వీధిలో ఎన్నో షాపులు ఉండగా తన షాపుకే రావటం వింతగా ఉన్నా.. ఆ ఆవు వల్ల తన వ్యాపారం డెవలప్ అయినందుకు సంతోషిస్తున్నారు ఓబయ్య.

ఈ ఆరు నెలల్లో ఒక్కసారిగా షాపులో పేడ వేయలేదని, మూత్రం కూడా పోయలేదని చెబుతున్నారు ఓనర్ ఓబయ్య. బయటకు వెళ్లి మాత్రం పేడ వేయటం విశేషంగా ఉందని చెబుతున్నారు. గోమాత వల్ల అదృష్టం కలిసివచ్చినట్లు చెబుతున్నారు. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆహ్వానిస్తాం చెబుతున్నారు. దీనికితోడు షాపునకు వచ్చే కస్టమర్లు కూడా పూజలు చేస్తున్నారని చెబుతున్నారు ఓబయ్య.