వ్యాపారస్తులు తమ వస్తువులు అమ్ముకోటానికి వివిధ ప్రచారాలునిర్వహిస్తుంటారు. ఇక సండే మార్కెట్ లో వాళ్లైతే చెప్పక్కర్లేదు…మాటల గారడీతో వినియోగ దారులను ఆకర్షించి అమ్మకాలు జరుపుతుంటారు. ఇంకోందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసి మార్కెట్ కు వచ్చిన వినియోగదారులు తమ ఎదుట ఆగేలా చేసుకుంటారు.
ముంబై లో ఇటీవల రోషన్ షింగే అనే నటుడు ఆకుకూరలు అమ్మేందుకు డ్యాన్స్ చేస్తూ వినియోగ దారులను ఆకర్షించాడు. అతడు చేసిన డ్యాన్స్ ఐపీఎల్ మ్యాచ్ ను గుర్తుకు తెచ్చింది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ను తలపించే విధంగా ఈ డ్యాన్స్ ఉంది.
14 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోలో అతను తెల్లని షార్ట్ ప్యాంట్, రెడ్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. కొత్తిమీర కట్ట రూ. 14కు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. అతని డ్యాన్స్ అందరినీ అబ్బురపరుస్తున్నది. ‘కొంతమంది ఐపీఎల్‌ను మిస్ అవుతున్నారు అనే క్యాప్షన్’తో స్మితా దేశ్‌ముఖ్ ట్విటర్‌లో షేర్ చేశారు. అతను గొప్ప అమ్మకపు వ్యక్తి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Someone is missing the @IPL pic.twitter.com/HvIug7DDeS
— Smita Deshmukh (@smitadeshmukh) June 20, 2020
Read: శానిటైజర్ రాసుకుని మరీ చోరీ చేసిన దొంగలు : దటీజ్ కరోనా