మంచి పనేగా: రోడ్డుపై వాహనాల ముందు డ్యాన్స్ వేస్తున్న యువతి

  • Publish Date - November 20, 2019 / 04:44 AM IST

మధ్య ప్రదేశ్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఓ యువతి స్టెప్పులేస్తూ.. వాహనదారుల వద్దకు వచ్చి వారికి ఏదో చెబుతోంది. ఆ తర్వాత రోడ్డు మీదకు వెళ్లి డ్యాన్స్ చేస్తోంది. అదేంటి ఆమెకు ఏమైనా పిచ్చిపట్టిందా అనుకుంటున్నారా.. కాదండోయ్ ఆ యువతి ప్రజలకు ట్రాఫిక్ నియమాలను డ్యాన్స్ రూపంలో గుర్తుచేస్తుంది.

ఈ రోజుల్లో మనుషులకు మంచి ఎప్పుడూ మంచిగా చెబుతే ఎక్కదుకదా.. అందుకే ఆమె ఇలా వెరైటీగా డ్యాన్స్ చేస్తూ చెప్పింది. సిగ్నల్ పడగానే వాహనాల ముందుకు వచ్చి నమస్కారం చేసి సీట్ బెల్ట్ పట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఎంతో అందంగా వారికి డ్యాన్స్ రూపంలో తెలిపింది. దీంతో వాహనాదారులు వెంటనే సీట్ బెల్ట్, హెల్మెట్ దరిస్తున్నారు.

సుభీ జైన్ అనే ఈ MBA స్టూడెంట్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నారు. ఈమె డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోని ఇప్పటికే 7వేల మందికి పైగా లైక్ చేశారు.