వైరల్ అవుతున్న పాక్ జర్నలిస్ట్ రిపోర్టింగ్

  • Publish Date - January 16, 2020 / 01:25 AM IST

పాకిస్తాన్ జర్నలిస్ట్ అమిన్ హఫీజ్ మరోసారి వార్తల్లో చెక్కర్లు కొడుతున్నాడు. ఆయనకు న్యూస్ రిపోర్టింగ్ చేయడమంటే ఓ పాషన్. అందుకే అందరిలా కాకుండా.. వెరైటీగా రిపోర్టింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. గతంలో గాడిద మీద కూర్చొని రిపోర్టింగ్ చేశాడు. ఇప్పుడు వేరే స్టైల్ లో రిపోర్టింగ్ చేశాడు. చక్రవర్తి వేషం ధరించి చేతిలో కత్తి, తలపై కిరీటం పెట్టుకుని రిపోర్టింగ్ చేశాడు.

అతని వెనక ఇద్దరు భటులు నిలబడి ఉంటాడు. అతను చేతిలో ఉన్న కత్తిని తిప్పుతూ రిపోర్టింగ్ చేశాడు. ఇందంతా పక్కనున్న జర్నలిస్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘బాబోయ్ ఈ జర్నలిస్ట్ మళ్లీ వచ్చాడా’ అని నవ్వుకుంటున్నారు.

అమిన్‌ హఫీజ్‌ పాకిస్తాన్‌ లోని జియో న్యూస్‌ చానల్‌ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఇలా ప్రతిసారి కొత్త కొత్తగా రిపోర్టింగ్ చేస్తూ.. అందరి దృష్టిలో మంచి రిపోర్టర్ గా పేరు సాధించాడు. మరి ఈసారి మళ్లి ఏవిధంగా వార్తల్లోకి ఎక్కుతాడో చూద్దాం.